జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదం.. రాష్ట్రానికి చెందిన జవాన్ బలవన్మరణం

by Kema Shiva Kumar |

జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir) సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదం.. రాష్ట్రానికి చెందిన జవాన్ బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir) సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన జవాన్ సంపంగి నాగరాజు (Sampangi Nagaraju) తన తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, నాగరాజు స్వస్థలం వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేట. ఈ మేరకు ఆయన భౌతికకాయాన్ని ఇవాళ ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ సమస్యల వల్లే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా బంధువులు తెలిపారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story