- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం....దంపతులు ఆత్మహత్య
by Sridhar Babu |
X
దిశ/జూలూరుపాడు : ఉద్యోగం ఇప్పిస్తానని ఓ దళారి డబ్బులు తీసుకొని మోసం చేయడంతో మండలంలోని సాయిరాం తండాకు చెందిన హలవత్ రత్నకుమార్ - పార్వతి దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మంగళవారం కొత్తగూడెం నుంచి మండలంలోని సాయిరాం తండాకు తీసుకువచ్చారు.
దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సింగరేణిలో ఉద్యోగం కోసం దళారిని ఆశ్రయించి డబ్బులు చెల్లించి మోసపోవడంతోనే ఈ దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
- Tags
- suicide
Next Story