శృంగార భార్య.. ఒకరితో ఎఫైర్.. భర్తకు తెలిసిందని ఐదుగురితో రొమాన్స్.. చివరకు ఏం జరిగిందంటే..??

by Disha Web |
శృంగార భార్య.. ఒకరితో ఎఫైర్.. భర్తకు తెలిసిందని ఐదుగురితో రొమాన్స్.. చివరకు ఏం జరిగిందంటే..??
X

దిశ, వెబ్‌డెస్క్ : మన సృష్టిలోనే అతిపవిత్రమైనది వివాహ బంధం. కానీ, అలాంటి బంధాలకే చాలా మంది కళంకం తెస్తున్నారు. భర్తకు తెలియకుండా భార్య.. భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలు పెట్టుకుని దాంపత్య జీవితాన్ని మట్టిపాలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇల్లాలు అదే విధంగా తన భర్తకు తెలియకుండా వేరే వాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అటు పుట్టింటిని, ఇటు మెట్టింటిని సమాజంలో తల ఎత్తుకోకుండా చేసింది. పిల్లలు సైతం ఆమె.. మా తల్లి అని చెప్పుకోకుండా ప్రవర్తించింది. చివరకు తన ప్రాణాలను సైతం పోగొట్టుకుంది. ఈ కామపిశాచి దుశ్చర్యల సంఘటన చెన్నైలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...

సెల్వం, సుమిత్ర భార్యాభర్తలు. పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. కాసిమేడు ఫిషింగ్ పోర్ట్ సమీపంలోని పుదుపున్నార్ పేట్‌లో నివాసం ఉండే సెల్వం వివిధ పనులపై ఎక్కువగా బయట ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. గృహిణిగా ఉండే సుమిత్రకు దైవ భక్తి ఎక్కువ. తరచూ గుళ్లు, గోపురాలు తిరుగుతూ పిల్లలతో కాలం గడుపుతుండేది. అయితే భర్త ఎక్కువ సమయం బయట ఉండటం.. ఇంట్లో సుమిత్ర ఒక్కటే ఉంటుండడంతో ఆమె విరహ వేదనకు గురయ్యేది. ఈ క్రమంలో సుమిత్ర మనసు పరాయి మగాళ్ల వైపు మళ్లింది. దీంతో నాగౌరావ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుని అక్రమ సంబంధానికి తెర లేపింది. ఈ విషయం కాస్త భర్త సెల్వంకు తెలియడంతో మందలించాడు. ఇద్దరు పిల్లలు అయ్యాక ఈ పాడు బుద్దులు ఏంటని ప్రశ్నించాడు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.

కొద్ది రోజులు మళ్లీ భక్తిలో మునిగిపోయిన భార్యను చూసి సెల్వం ఆమె మారిందని మళ్లీ యథావిధిగా పనులకు వెళ్లడం ప్రారంభించాడు. కుక్క తోక వంకర అన్నట్లుగా కామంతో రగిలిపోతున్న సుమిత్ర.. మళ్లీ పరాయి మగాళ్ల సుఖం కోసం తాపత్రయపడింది. అలా మరో ఇద్దరితో సంబంధం పెట్టుకుని రాసలీలల్లో మునిగిపోయింది. ఇది తెలుసుకున్న భర్త.. ఆమెను మందలించడంతోపాటు విషయాన్ని తన అత్తమామలకు వివరించాడు. సుమిత్ర తల్లిదండ్రులు సైతం కూతురిని హెచ్చరించారు. అయితే సుమిత్ర వాళ్ల మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎలాగైనా విషయం అందరికీ తెలిసిపోయిందని, తాను బహిరంగంగానే రెచ్చిపోయింది.

ఇప్పుడున్న ఇద్దరికి తోడు మరో ఇద్దరితో ఎఫైర్ పెట్టుకుంది. అలా ఐదుగురితో రొమాన్స్ చేసింది. దీంతో సుమిత్రను కంట్రోల్ చేయలేని భర్త.. తన అత్తమామలతో కలిసి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని అందరినీ నమ్మించి అంత్యక్రియలు చేశారు. కానీ సుమిత్ర ప్రవర్తన తెలిసిన స్థానికులు భర్తే హత్య చేశాడని చర్చకు తెరలేపారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేశారు. తల్లి చనిపోవడం, కుటుంబం మొత్తం జైలుకు వెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మాత్రం దిక్కులేని వారై.. బిక్కు బిక్కు మంటూ ఒంటరిగా ఉండిపోయారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.

READ MORE

భార్య అర్ధరాత్రి వరకు మరిదితో అదే పనిలో బిజీ.. భర్త చూడటంతో..


Next Story