గుర్తు తెలియ‌ని వృద్ధుడి మృత‌దేహం ల‌భ్యం

by Ratna Kumari |

గుర్తు తెలియ‌ని వృద్ధుడి మృత‌దేహం ల‌భ్య‌మైన సంఘ‌ట‌న మేడ్చ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని రైల్వే స్టేష‌న్ స‌మీపంలో సోమ‌వారం చోటు చేసుకుంది.

గుర్తు తెలియ‌ని వృద్ధుడి మృత‌దేహం ల‌భ్యం
X

దిశ‌, మేడ్చ‌ల్ : గుర్తు తెలియ‌ని వృద్ధుడి మృత‌దేహం ల‌భ్య‌మైన సంఘ‌ట‌న మేడ్చ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని రైల్వే స్టేష‌న్ స‌మీపంలో సోమ‌వారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రైల్వే స్టేష‌న్ స‌మీపంలో వృద్ధుడి మృత‌దేహం క‌నిపించింద‌ని స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. మృతుడు సుమారు 60-70 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ట్టు గుర్తించారు. అత‌ని శ‌రీరం పై గాయాల గుర్తులు ఉన్న‌ట్టు ప్రాథ‌మికంగా గుర్తించారు. స‌న్న‌ని దేహ ధారుడ్యం, నెరిసిన న‌ల్ల‌ని జుట్టు, గ‌డ్డం, మీసాల‌తో ఉన్నారు. మృత‌దేహం పై లేత రంగు ష‌ర్టు, ముదురు రంగు చెక్స్ లుంగీ ధ‌రించినట్టు పోలీసులు తెలిపారు. మృతునికి సంబంధించిన వివ‌రాలు తెలియ‌రాలేద‌ని.. ఎవ‌రైనా ఈ వ్య‌క్తి గురించి స‌మాచారం తెలిస్తే.. మేడ్చ‌ల్ పోలీసుల‌ను సంప్ర‌దించాల‌ని కోరారు.

Next Story