- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకును ఢీకొట్టిన డీసీఎం..భార్యాభర్తల మృతి
బైకును డీసీఎం ఢీకొనడంతో బైక్ పై ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాల అవ్వగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దిశ, పరిగి : బైకును డీసీఎం ఢీకొనడంతో బైక్ పై ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాల అవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరిగి మున్సిపల్ పైపు నుంచి కొడంగల్ వైపునకు వెళ్తున్న బైకును శనివారం సాయంత్రం హైవే 163 పై సుల్తాన్ పూర్ గేట్ వద్ద డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న మహిళ పై నుంచి డీసీఎం వ్యాన్ దూసుకు వెళ్ళింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడిపిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలవగా వెంటనే అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన మహిళ ఆధార్ కార్డు ఆధారంగా బొంరాస్ పేట్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొడిగంటి లక్ష్మి(33) గా గుర్తించారు. బైక్ నడిపిస్తున్న వ్యక్తి ఆమె భర్త వెంకటయ్య గుర్తించారు వెంకటయ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. బైకును ఢీకొట్టిన డీసిఎం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. డీసీఎం వ్యానును పోలీస్ స్టేషన్ కు, మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తీవ్రగాయాలైన లక్ష్మి భర్త వెంకటయ్య వికారాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద స్థలానికి సీఐ సామ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ మోహన్ కృష్ణ, తమ సిబ్బందితో కలిసి వెళ్లి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.






