- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్చర్లలో డీసీఎం బీభత్సం.. రెండు కార్లను ఢీకొని బోల్తాపడ్డ డీసీఎం..
జడ్చర్లలో ఆదివారం డీసీఎం బీభత్సం సృష్టించింది.

దిశ, జడ్చర్ల: జడ్చర్లలో ఆదివారం డీసీఎం బీభత్సం సృష్టించింది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కల్వకుర్తి రోడ్డు సమీపంలో శివాలయం వద్ద వరి ధాన్యం లోడుతో వెళ్తున్న డీసీఎం, దాని ముందు వెళ్తున్న రెండు కార్లను ఢీకొని అదుపుతప్పి బోల్తాపడడంతో డీసీఎం డ్రైవర్ హరికి స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎంకు బ్రేకులు పడకుండా అదే వేగంతో ముందుకు దూసుకొచ్చుంటే ముందు వెళ్తున్న రెండు కార్లలో ఉన్న రెండు కుటుంబాల్లో అనేక మంది ప్రాణాలు పోయేవని కారులో ప్రయాణిస్తున్న బాధ్యత ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
డీసీఎం డ్రైవర్ తప్ప తాగి డీసీఎంను రాష్ గా డ్రైవింగ్ చేయడం ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని తప్పదాగి వాహనాలు నడుస్తూ అనేకమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు స్వల్పంగా గాయపడిన డ్రైవర్ హరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






