- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mother in Law Murder: విశాఖలో దారుణం.. చిరాకు పెడుతోందని దొంగ-పోలీస్ ఆటతో అత్త సజీవదహనం
చిన్న చిన్న కారణాలకే మనుషులను చంపేస్తున్నారు. అప్పు ఇవ్వలేదని ఒకడు, భార్య చికెన్ వండలేదని మరొకడు, ఫోన్ చూడొద్దు అన్నారని ఇంకొకరు..

దిశ, వెబ్‌డెస్క్: చిన్న చిన్న కారణాలకే మనుషులను చంపేస్తున్నారు. అప్పు ఇవ్వలేదని ఒకడు, భార్య చికెన్ వండలేదని మరొకడు, ఫోన్ చూడొద్దు అన్నారని ఇంకొకరు, ఫోన్ లో ఎక్కువగా మాట్లాడొద్దన్నారని మరొకరు.. ఇలా సిల్లీ రీజన్స్ కే నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజాగా విశాఖలోనూ ఇలాంటి హత్యే జరిగింది. పదే పదే పని పేరుతో తనను విసిగిస్తోన్న అత్తను కోడలు.. దొంగ, పోలీస్ ఆటతో ప్లాన్ చేసి చంపేసింది. ఈ విషయం తెలిసి ఇరుగు, పొరుగు వారే కాదు.. రాష్ట్రమంతా షాకవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తికి చెందిన జయంతి కనక మహాలక్ష్మి (66) అనుమానాస్పద రీతిలో మరణించింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆ అత్త అగ్నిప్రమాదంలో మరణించలేదని, కోడలే కడతేర్చిందని తేల్చారు. తన పేరు బయటికి రాకుండా అత్తను చంపేందుకు లలిత దొంగపోలీస్ ఆట ఆడింది. కోడలి మాటలు నమ్మిన అత్త సరేనని తలూపింది. ఆమెను కుర్చీలో కూర్చోపెట్టిన లలిత.. కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కూడా కట్టింది. ఆపై పెట్రోల్ పోసి, దేవుడి గదిలో ఉన్న దీపాన్ని ఆమెపైకి విసిరేసింది. ఆమె మంటల్లో కాలిపోతుండగా.. తలుపులు మూసి బయటికి వెళ్లిపోయింది. మా అత్త మంటల్లో కాలిపోతోందంటూ ఇరుగు పొరుగువారిని పిలిచి మొసలి కన్నీరు కార్చింది. అందరూ అగ్నిప్రమాదంగానే భావించి.. అయ్యో పాపం అనుకున్నారు.
కొసమెరుపు ఏంటంటే.. పోలీసులు సైతం తొలుత దీనిని అగ్నిప్రమాదమనే నమ్మారు. ఫార్మాలిటీకి కేసు నమోదు చేసి విచారణ చేయగా.. కోడలు ప్రవర్తించిన తీరు వారికి అనుమానాన్ని రేకెత్తించింది. కాస్త లోతుగా విచారించడంతో కోడలు తన నేరాన్ని ఒప్పుకుంది. చీటికీ మాటికీ తనను చికాకు పెడుతుండటంతోనే చంపేసినట్లు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. లలితను అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారు. ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.






