తమ్ముడితో పారిపోయిన కూతురు.. అన్నను చంపి పగతీర్చుకున్న తండ్రి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లా కీరత్‌పూర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. తమ్ముడు ఓ అమ్మాయితో పారిపోతే అన్నను టార్గెట్ చేసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అనీష్ ఖురేషి, తాహిరా అన్నాచెల్లెళ్లు. దీంతో అనీష్ కూతురు.. వరుసకు

తమ్ముడితో పారిపోయిన కూతురు.. అన్నను చంపి పగతీర్చుకున్న తండ్రి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లా కీరత్‌పూర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. తమ్ముడు ఓ అమ్మాయితో పారిపోతే అన్నను టార్గెట్ చేసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అనీష్ ఖురేషి, తాహిరా అన్నాచెల్లెళ్లు. దీంతో అనీష్ కూతురు.. వరుసకు బావ అయిన తాహిరా చిన్న కొడుకు గుఫ్రాన్‌తో ప్రేమలో పడిపోయింది. తండ్రి ఒప్పుకోకపోవడంతో పారిపోయింది. దీంతో పగ పెంచుకున్న ఆయన.. గుఫ్రాన్ అన్న రిజ్వాన్‌ను టార్గెట్ చేశాడు.

సెప్టెంబర్ 23న ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. 12 కంటే ఎక్కువ సార్లు అతన్ని కత్తితో పొడిచి గజ్రౌలా ఆచ్ పాల్ ఏరియాలో పడేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రిజ్వాన్‌ను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చి హాస్పిటల్‌కు తరలించారు. ముందుగా బిజ్నోర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మీరట్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేయడంతో.. అక్కడికి పంపించి చికిత్స అందించారు. కానీ ట్రీట్మెంట్ జరుగుతుండగానే రిజ్వాన్ కన్నుమూశాడు. దీంతో రిజ్వాన్ తల్లి నిందితుడు అనీష్ ఖురేషిపై కేసు పెట్టింది. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. అతపి లొకేషన్‌ను ట్రాక్ చేసేందుకు ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో అలర్ట్ చేశారు.

Next Story