తిరుపతిలో ఘోర ప్రమాదం.. దంపతులు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-28 09:21:27  IST  )

పూతలపట్టు - నాయుడుపేట హైవేపై ఘోర కారుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు.

తిరుపతిలో ఘోర ప్రమాదం.. దంపతులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పూతలపట్టు - నాయుడుపేట హైవేపై ఐతేపల్లి వద్ద ముందు వెళ్తున్న కారును, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. కారు వేగానికి ముందున్న కారు పల్టీలు కొట్టి అవతలి రోడ్డుపై పడింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా.. దంపతులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు కార్లను పక్కకు తీసి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్ కు చెందిన అశోక్, చంద్రకళగా గుర్తించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు అరుణాచలం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story