- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బట్టల దుకాణంలో దారుణం.. చీర డ్యామేజ్ అయిందని వెళ్తే దళిత మహిళపై అత్యాచారం.. పోలీసులు, బాబా అంతా ఒకటై...
యూపీ బలరాంపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉత్రావులాలో ఓ షాపులో బట్టలు కొనుగోలు చేసింది దళిత మహిళ. అయితే చీర డ్యామేజ్ కావడంతో నెక్స్ట్ డే ఎక్స్‌చేంజ్ కోసం వెళ్లింది. అయితే పక్కనే ఉన్న ఓనర్ ఇంట్లో మంచి చీరలు ఉన్నాయని..

దిశ, వెబ్ డెస్క్ : యూపీ బలరాంపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉత్రావులాలో ఓ షాపులో బట్టలు కొనుగోలు చేసింది దళిత మహిళ. అయితే చీర డ్యామేజ్ కావడంతో నెక్స్ట్ డే ఎక్స్‌చేంజ్ కోసం వెళ్లింది. అయితే పక్కనే ఉన్న ఓనర్ ఇంట్లో మంచి చీరలు ఉన్నాయని.. అక్కడ చూసుకోమని పంపించారు పనిచేసేవాళ్లు. ఆమెను లోపలికి పిలిచిన ఓనర్ మెహబూబ్, మరో వ్యక్తి నదీమ్ రేప్ చేశారు. ఈ విషయాన్ని ఆ ఊరి పెద్ద అయిన మెహబూబ్ తండ్రి జమాలుద్దీన్ అలియాస్ ఛాంగూర్ పీర్ బాబాకు తెలిపింది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని కోరింది.
అయితే అతను మరో వ్యక్తితో వివాహం చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తానని, డబ్బులు కూడా ఇస్తాని చెప్పాడు. కానీ ఆ ఆఫర్‌ను తిరస్కరించిన బాధితురాలు.. పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లింది. కానీ ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. తనకు ఎవరు ఎదురురారని, ఆఫర్‌ను అంగీకరించడం తప్ప మరో మార్గం లేదని చెప్పాడు జమాలుద్దీన్. కానీ న్యాయం కోసం పోరాడిన ఆమె.. లక్నో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో జమాలుద్దీన్, మెహబూబ్, నమీద్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.






