- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధతో దినసరి కూలీ మృతి
అప్పుల బాధ భరించలేక దినసరి కూలీ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, సైదాపూర్ : అప్పుల బాధ భరించలేక దినసరి కూలీ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకునూర్ గ్రామానికి చెందిన బత్తుల రమేష్ (45) దినసరి కూలీ పని చేస్తూ తన భార్యను కూతురుని పోషిస్తుండేవాడు. ఇటీవల తన కూతురు పై చదువుల కోసం, ఇల్లు కట్టుకునేందుకు ఇంటి స్థలం కొనుగోలు చేయడంతో అప్పులు ఎక్కువై అప్పు తీర్చే మార్గం లేక మనస్థాపానికి గురైన రమేష్ మంగళవారం రాత్రి తన భార్యకు బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాకపోవడంతో బుధవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తన భర్త మృతిపై ఎవరిపైన ఎలాంటి అనుమానాలు లేవని మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై కొప్పుల స్వాతి తెలిపారు.






