వడదెబ్బతో దినసరి కూలీ మృతి

by Kema Shiva Kumar |

వడదెబ్బతో ఓ దినసరి కూలీ మృతిచెందిన ఘటన శుక్రవారం వేములవాడలో పట్టణంలో చోటుచేసుకుంది.

వడదెబ్బతో దినసరి కూలీ మృతి
X

దిశ, వేములవాడ : వడదెబ్బతో ఓ దినసరి కూలీ మృతిచెందిన ఘటన శుక్రవారం వేములవాడలో పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన గోనెల శంకర్ (53) రోజువారి కూలీ పని నిమిత్తం వేములవాడ పట్టణానికి శుక్రవారం ఉదయం చేరుకున్నాడు. కూలి పని చేస్తుండగా మండుతున్న ఎండలకు వడదెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన సహచర కూలీలు అతడిని వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శంకర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య తిరుమల, కూతుర్లు శ్రావ్య, హర్షిణి ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని రూరల్ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజ్యం, గ్రామ సర్పంచ్ సామ కవిత, గ్రామస్థులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం తరపున సాయం అందించేందుకు ఎమ్మెల్యే రమేష్ బాబుతో మాట్లాడి సంపూర్ణ సహకారం అందిస్తామని ఆకుల దేవరాజ్యం తెలిపారు.

Next Story