ఆక్సిజన్‌ ప్లాంట్‌లో సిలిండర్ బ్లాస్ట్.. భారీగా ప్రాణ నష్టం ఉండే చాన్స్

by Kema Shiva Kumar |

ఆక్సిజన్ ప్లాంట్‌ (Oxygen Plant)లో సిలిండర్ బ్లాస్ అయిన ఘటన పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని మోహాలీ (Mohali) పట్టణంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

ఆక్సిజన్‌ ప్లాంట్‌లో సిలిండర్ బ్లాస్ట్.. భారీగా ప్రాణ నష్టం ఉండే చాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆక్సిజన్ ప్లాంట్‌ (Oxygen Plant)లో సిలిండర్ బ్లాస్ అయిన ఘటన పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని మోహాలీ (Mohali) పట్టణంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెహాలీలోని ఫేజ్-9లోని ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఆక్సిజన్ ప్లాంట్‌లో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మోహాలీ పోలీసులు, పౌర పరిపాలన అధికారులు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఫేజ్-6లోని సివిల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే చాన్స్ ఉంది.

Next Story