ఏపీలో భారీ సైబర్ స్కామ్.. దంపతుల నుండి 85 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

by Ajay Maddhiboyina |

ఏపీలో కేటుగాళ్లు భారీ సైబ‌ర్ స్కామ్ కు పాల్ప‌డ్డారు. దంప‌తుల నుండి ఏకంగా రూ.85 ల‌క్ష‌లు కాజేశారు. ఈ ఘ‌టన కాకినాడ జిల్లా పెద్దాపురంలోని వ‌ర్జుల వారి వీధిలో చోటు చేసుకుంది.

ఏపీలో భారీ సైబర్ స్కామ్.. దంపతుల నుండి 85 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో కేటుగాళ్లు భారీ సైబ‌ర్ స్కామ్ కు పాల్ప‌డ్డారు. దంప‌తుల నుండి ఏకంగా రూ.85 ల‌క్ష‌లు కాజేశారు. ఈ ఘ‌టన కాకినాడ జిల్లా పెద్దాపురంలోని వ‌ర్జుల వారి వీధిలో చోటు చేసుకుంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబ‌డులు పేరుతో పెద్దాపురానికి చెందిన సురే వేణు, అత‌డి భార్య‌ను న‌మ్మించారు. 3 నెల‌ల్లో 300 శాతం లాభం ఇస్తామ‌ని వాట్సాప్ లో సందేశాలు పంపిస్తూ దంప‌తును ఆక‌ర్షించారు. మోసగాళ్ల మాట‌లు న‌మ్మిన దంపతులు ఆన్ లైన్ ద్వారా రూ.85 ల‌క్ష‌లు డిపాజిట్ చేశారు. అనంత‌రం డ‌బ్బులు తిరిగిరాక‌పోవ‌డంతో మోస‌పోయామ‌ని భావించారు. పెద్దాపురం పోలీసుల‌ను ఆశ్ర‌యించి వారికి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇక సైబ‌ర్ నేరాల‌పై పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌గాహన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం కూడా ఆన్ లైన్ ద్వారా ఇత‌ర కార్య‌క్ర‌మాల ద్వారా సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది. కానీ అమాయ‌క ప్ర‌జ‌లు మాత్రం కేటుగాళ్ల చేతిలో మోస‌పోతూనే ఉన్నారు.

Next Story