అమెరికన్లే టార్గెట్‌.. హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సైబర్ మోసాలు

by Ramesh Naini |

అమెరికన్లను టార్గెట్‌గా చేసుకోని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు.

అమెరికన్లే టార్గెట్‌.. హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సైబర్ మోసాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో సైబర్ నేరాలు (Cyber ​​frauds) రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎవరికి అనుమానం రాకుండా ఏకంగా పెద్ద కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్‌లో (Fake call center) ఫేక్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ ముఠాను.. (Telangana Cyber Security Bureau)సైబర్ పోలీసులు కనిపెట్టారు. హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలు సరిచేస్తామంటూ విదేశీయులు, ముఖ్యంగా అమెరికన్లను టార్గెట్‌గా చేసుకోని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మనస్విని అనే మహిళా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరిట నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. బుధవారం పోలీసులు రైడ్ చేసి దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ అనే వ్యక్తులతో కలిసి కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల వ్యక్తులను ఆమె టెలీకార్లుగా నియమించుకొని మోసాలకు పాల్పడుతోంది.

బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి విదేశీయుల సొమ్ము కాజేస్తున్నారు. ఈ మేరకు గురువారం నకిలీ కాల్ సెంటర్ వివరాలను టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయెల్ (TGCSB Director Shikha Goel) మీడియాకు వెల్లడించారు. ముఠా నుంచి 52 ల్యాప్‌టాప్‌లు, 63 సెల్ ఫోన్లు, 27 ఎంప్లాయి ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక, ఈ ముఠా నెట్ వర్క్‌పై లోతుగా విచారణ చేయనున్నట్లు తెలిపారు.

Next Story