- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cyber Crime: మేఘా కంపెనీకి బిగ్ షాక్.. సింపుల్‌గా రూ.కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. అమాయక జనం నుంచి కార్పొరేట్ సంస్థలను కూడా బురిడి కొట్టిస్తూ సులువుగా డబ్బు సంపాదించేందుకు విచ్చలవిడిగా మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ (Whatsaap), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొరియర్ల పేరిట డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు (Stock Markets), ట్రేడింగ్ (Trading)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా కంపెనీ యాజమాన్యాన్ని సైతం సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టించారు. ఏకంగా రూ.5.47 కోట్లను దోచేశారు. వివరాల్లోకి వెళితే.. మేఘా కంపెనీ (Megha Company)కి అవసరమైన ఎక్విప్‌మెంట్ కోసం అక్కడి పని చేసే సిబ్బంది నెదర్లాండ్స్ (Netherlands)కి చెందిన కంపెనీకి ఆర్డర్‌ను మెయిల్ ద్వారా పంపారు. అనంతరం అదే కంపెనీకి ఆన్‌లైన్ (Online) ద్వారా డబ్బులు కూడా చెల్లించారు. ప్రతిసారి పేమెంట్ తరువాత అక్కడి కంపెనీ ప్రతినిధుల నుంచి ఆమౌంట్ రిసీవ్ అయినట్లుగా కన్ఫర్మేషన్ మెయిల్ (Confirmation Mail) వచ్చేది. కానీ, అచ్చం ఆ కంపెనీ లాగే ఈ-మెయిల్ (E-mail)లో అక్షరం మార్చి సైబర్ నేరగాళ్లు మేఘా కంపెనీ ప్రతినిధులకు మెయిల్ చేశారు. తమ అకౌంట్ పని చేయడం లేదని మరో ఖాతాకు పంపించాలని రిక్వెస్ట్ చేశారు. అది నిజమేనని నమ్మిన మేఘా కంపెనీ (Megha Company) సిబ్బంది సైబర్ కేటుగాళ్లకు రూ.5.47 కోట్లను రెండు దఫాలుగా చెల్లింపులు చేశారు. ఆ తరువాత తాము మోసపోయామని గ్రహించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.






