హైదరాబాద్‌ మెట్రోలో సెక్యూరిటీ సిబ్బందిగా ట్రాన్స్‌జెండర్లు.. హర్షం వ్యక్తం చేసిన సీవీ ఆనంద్‌

by Ramesh Naini |   (  Updated:2025-12-01 15:47:39  IST  )

సమాజంలో వివక్షకు గురిఅవుతున్న (Transgender)​ ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది.

హైదరాబాద్‌ మెట్రోలో సెక్యూరిటీ సిబ్బందిగా ట్రాన్స్‌జెండర్లు.. హర్షం వ్యక్తం చేసిన సీవీ ఆనంద్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో వివక్షకు గురిఅవుతున్న (Transgender)​ ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ మెట్రోలో ట్రాన్స్‌జెండర్లు సెక్యూరిటీ గార్డులుగా విధుల్లో చేరి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. 20 మంది ట్రాన్స్​జెండర్లను సెక్యూరిటీ సిబ్బందిగా నియమించారు. వారికి ప్రత్యేక శిక్షణను అందించి, స్టేషన్‌ల భద్రత, ప్రయాణికుల స్క్రీనింగ్‌ వంటి కీలక బాధ్యతలను వీరు నిర్వహించనున్నారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు విస్తరించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.

ఈ సందర్భంలో రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్‌ సీవీ ఆనంద్‌ ఎక్స్ (ట్వీట్టర్) ద్వారా స్పందిస్తూ ‘ఇది చూసి చాలా ఆనందంగా ఉంది, వారు సమాజంలో కలిసిపోవడానికి మరో ముందడుగు’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ట్రాన్స్​జెండర్ సెక్యూరిటీ సిబ్బంది మహిళల భద్రతకు మద్దతు ఇస్తారని సంస్థ పేర్కొంది. ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు, బ్యాగేజ్ స్కానర్‌లలో సహాయం చేస్తారని, స్టేషన్లు రైళ్లలో భద్రతను బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా సంస్థ తెలిపింది. కాగా, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించే ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా ఇటీవల 44 మంది ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ట్వీట్ ఇదే..

Next Story