- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయిని కస్టమ్ అధికారులు సీజ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా మరోసారి భారీగా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. ఇవాళ కస్టమ్స్ (Customs) అధికారులు జరిపిన తనిఖీల్లో అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన ‘హైడ్రోఫోనిక్ గంజాయి’ (Hydroponic Weed) గుట్టురట్టయింది. బ్యాంకాక్ నుంచి అక్రమంగా వాటర్ బాటిళ్లలో తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న అధికారులు, వారి వద్ద నుంచి 8.705 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లుగా అందిన పక్కా నిఘా సమాచారంతో అధికారులు ఎయిర్‌పోర్టులో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికుల లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, వాటర్ బాటిళ్ల లోపల లోపల ప్రత్యేకంగా ప్యాక్ చేసిన హైడ్రోఫోనిక్ గంజాయి లభ్యమైంది. పట్టుబడిన ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.రూ.3.05 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇండియాకు ఎవరు గంజాయి పంపారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.






