- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా జరుగుతున్న అక్రమ కరెన్సీ రవాణాకు కస్టమ్స్ (Customs) అధికారులు మరోసారి బ్రేక్ వేశారు. హాంకాంగ్‌కు అక్రమంగా విదేశీ కరెన్సీ (Foreign Currency)ని తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హాంకాంగ్ (Hong Kong)కు వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు, అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సదరు ప్రయాణికుడి వద్ద ఎటువంటి అనుమతులు లేని సుమారు రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు గుర్తించారు. బ్యాగుల్లో అత్యంత చాకచక్యంగా దాచి తరలించే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, విదేశీ కరెన్సీ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు..? దీని వెనుక ఏదైనా హవాలా ముఠా ఉందా? అనే కోణంలో అధికారులు సదరు ప్రయాణికుడిని విచారిస్తున్నారు






