- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. రూ.55 లక్షల బంగారం సీజ్
by Kema Shiva Kumar |
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి బంగారం దొరకడం కలకలం రేపుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో కస్టమ్స్ అధికారులు ఇంటర్నేషనల్ అరైవల్స్ వద్ద మరోసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని తనిఖీ చేయగా.. రహస్యంగా దాచి ఉంచిన బంగారం బయటపడింది. నిందితుడి వద్ద నుంచి 374 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ గోల్డ్ విలువ సుమారు రూ.55 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న సదరు నిందితుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
Next Story






