- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.10 కోట్ల విలువైన గంజాయి సీజ్
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అర్థరాత్రి దాటాక విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో అర్ధరాత్రి దాటిన తర్వాత కస్టమ్స్ అధికారులు నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ (Bangkok) నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ.10 కోట్ల విలువైన 10 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన ఫ్లైట్ ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం స్కానింగ్ చేస్తుండగా, ఓ ప్యాసింజర్ బ్యాగులపై అధికారులకు గట్టి అనుమానం వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడిని పక్కకు పిలిచి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, లోపల ప్రత్యేక ప్యాకెట్లలో దాచి ఉంచిన 10 కేజీల మేలురకం హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Weed) బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ మేరకు డ్రగ్స్ తరలిస్తున్న నిందితుడిని కస్టమ్స్ అధికారులు వెంటనే అరెస్ట్ చేసి, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు.






