- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. 3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) కేంద్రంగా జరుగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల ఆటకట్టించారు కస్టమ్స్ అధికారులు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న భారీ డ్రగ్స్ నిల్వలను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం థాయ్ ఎయిర్‌వేస్ (Thai Airways)లో విమానంలో బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆమెను నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె లగేజీలో దాచి ఉంచిన సుమారు 3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic cannabis) బయటపడింది. సాధారణ గంజాయితో పోలిస్తే దీని మత్తు తీవ్రత, అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
మహిళా స్మగ్లర్ అరెస్ట్..
పట్టుబడిన డ్రగ్స్‌ను సీజ్ చేసిన అధికారులు, సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఆమె కేవలం డ్రగ్స్ చేరవేసే కొరియర్’ (Drug Mule) మాత్రమేనా..? లేక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో ఆమెకు నేరుగా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని ఎవరికి ఈ డ్రగ్స్ చేరవేసేందుకు ఆమె వచ్చిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో బ్యాంకాక్, దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో, ఎయిర్‌పోర్టులో కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు నిఘాను మరింత కఠినతరం చేశారు.






