ఎయిర్‌పోర్టులలో కస్టమ్స్ తనిఖీలు.. రూ.9 కోట్ల విలువైన విదేశీ గంజాయి సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-01 03:42:00  IST  )

దేశవ్యాప్తంగా డ్రగ్స్ (Drugs) వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎయిర్‌పోర్టులలో కస్టమ్స్ తనిఖీలు.. రూ.9 కోట్ల విలువైన విదేశీ గంజాయి సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా డ్రగ్స్ (Drugs) వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవులు (Ports)ను కస్టమ్స్ అధికారులు (Customs officials) జల్లెడపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీ, కంటైనర్‌ను క్లియర్ చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో విదేశీ గంజాయి అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు స్మగ్లర్ల నుంచి ట్రాలీ బ్యాగుల్లో ఉన్న 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. అయితే, పట్టుబడిన విదేశీ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.9 కోట్లకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Next Story