- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వాతంత్ర సమరయోధుని మృతికి సీపీఐ నివాళి..
by Batti.Sumithra |
ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన మాజీ సీపీఐ నాయకులు స్వాతంత్ర సమరయోధుడు ఎర్రం శెట్టి సీతయ్య (80) గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు.

X
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన మాజీ సీపీఐ నాయకులు స్వాతంత్ర సమరయోధుడు ఎర్రం శెట్టి సీతయ్య (80) గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా, మృతదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఐ పార్టీ బలోపేతానికి ఎర్రం శెట్టి చేసిన సేవలను కొనియాడారు. నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్దంగా అభివర్ణించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, ఎర్ర బాబు తదితరులు ఉన్నారు.
Next Story






