- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case: సీపీ సజ్జనార్ సంచలన ఆదేశాలు
Phone Tapping Case: సీపీ సజ్జనార్ సంచలన ఆదేశాలు

దిశ, వెబ్‌డెస్క్: సిట్ అధికారులతో హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సీపీ సజ్జనార్ సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో పూర్తి ఛార్జిషీట్‌కు ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉన్న అందరినీ విచారించాలని చెప్పారు. రాజకీయ నేతలు, అధికారులు ఎవరినీ వదలొద్దని అన్నారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అసలు కుట్ర సూత్రధారి ఎవరు? ప్రభాకర్‌రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రభాకర్‌రావును సీపీ సజ్జనార్ స్వయంగా విచారించడానికి సిద్ధమయ్యారు. సోమవారం ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లి విచారించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను ఏసీపీ, డీసీపీ, జాయింట్ సీపీ స్థాయి అధికారులు మాత్రమే విచారించారు. కమిషనర్ స్థాయిలో స్వయంగా నిందితుడిని విచారించటం ఇదే తొలిసారి కానుంది.






