- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐబొమ్మ రవిని స్వయంగా విచారిస్తున్న CP సజ్జనార్
బొమ్మ రవిని స్వయంగా విచారిస్తున్న CP సజ్జనార్

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ రవి కేసు(iBomma Ravi Case) విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం నాటి విచారణలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(CP Sajjanar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ స్వయంగా రవిని విచారిస్తున్నారు. నగరంలోని సైబర్ క్రైమ్ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. రవి మీద ఇప్పటివరకు ఐటీ, చట్టం, సినిమా పైరసీ, మోసం ద్వారా నష్టం, అనుమతి లేకుండా ప్రైవేటు చిత్రాలను దొంగిలించి ప్రసారం, గోప్యతకు భంగం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటికి అదనంగా నిన్న ఫారినర్స్ యాక్ట్ జోడించారు. విదేశీయులు మన దేశంలో నేరాలకు పాల్పడితే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. రవి ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరుడు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాకపోవడంతో పోలీసులు ఫారినర్స్ యాక్ట్‌లోని సెక్షన్లను జోడించారు. రవిని ఐదు రోజుల పోలీసుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించడంతో.. చంచల్‌గూడ జైలు నుంచి గురువారం హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌కు తీసుకొచ్చారు. మూడ్రోజులుగా విచారణ కొనసాగుతోంది.
Read More... అలా పుట్టుకొచ్చినవాడే ఐ-బొమ్మ రవి.. నటుడు నరసింహారావు కామెంట్స్






