- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో ఆ దేశస్తులు ఉన్నారు.. CP ఆనంద్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌తో పాటు, పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌ల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌తో పాటు, పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌ల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారలు రంగంలోకి దిగారు. సిరాజ్, సమీర్ ఇచ్చిన సమాచారంతో ఎన్‌ఐఏ, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అధికారులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సిరాజ్ ఇంట్లో పేలుళ్లకు సంబంధించి మందుగుండు సామగ్రి, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లు, సిరాజ్ వినియోగించే బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఎన్‌ఐఏ సోదాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CP Anand) స్పష్టత ఇచ్చారు. సిరాజ్, సమీర్ కేసును NIA దర్యాప్తు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో మొత్తం నాలుగు చోట్ల NIA అధికారులు సోదాలు జరిపారని అన్నారు. కావాలంటే వారికి హైదరాబాద్ పోలీసుల సహకారం కూడా అందిస్తామని చెప్పారు. సమీర్‌తో ఎవరెవరికి లిక్స్ ఉన్నాయో ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటకు వస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన వారున్నారని.. ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. అంతేకాదు.. వారంతా అడ్డదారుల్లో ఆధార్ తీసుకున్నట్లు గుర్తించామని చెప్పారు.






