- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డి బ్యాచ్‌కి కస్టడీ పొడిగింపు
by Bhoopathi Nagaiah |
ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

X
దిశ, రాజేంద్రనగర్: ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు రెండు రోజుల కస్టడీ ముగిసిన అనంతరం ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం నిందితులను మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. అయితే, కేసు వివరాలు పరిశీలించిన న్యాయస్థానం ఐదు రోజులు మంజూరు చేయకుండ మరో రెండు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు మిగిలిన రోజుల్లో మరింత కీలక సమాచారం సేకరించేందుకు విచారణను వేగవంతం చేయనున్నారు. కేసులో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story






