ఘోర ప్రమాదం.. భార్యభర్తలు దుర్మరణం

by Naga Rani Yarlagadda |

చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు.

ఘోర ప్రమాదం.. భార్యభర్తలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. బైరెడ్డిపల్లి మండలం కప్పల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు.. అదుపుతప్పి లారీని ఢీ కొట్టింది. దీంతో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాద తీవ్రతకు కారు ఫ్రంట్ పార్ట్ అంతా నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అనంతపురం జిల్లాకు చెందిన దంపతులుగా గుర్తించారు. అతివేగం, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తులోకి జారడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story