అధికారులపై అవినీతి ఆరోపణలు.. సాలూరు మున్సిపల్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ (ACB) అధికారులు వరుస దాడులు చేస్తున్నప్పటికీ.. అవినీతి అధికారుల తీరు మాత్రం మారడం లేదు.

అధికారులపై అవినీతి ఆరోపణలు.. సాలూరు మున్సిపల్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ (ACB) అధికారులు వరుస దాడులు చేస్తున్నప్పటికీ.. అవినీతి అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ప్రతి పనికి ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. చేస్తున్న డ్యూటీకి న్యాయం చేయకుండా.. విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతూ సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాలకు రావాలంటేనే భయపడేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ అవినీతి నిరోధక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సాలూరు మున్సిపల్ కమిషనర్ జయరాం, మరో అధికారిపై ఇటీవలే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వారికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఏసీబీ టీమ్ సాలూరు మున్సిపల్ కార్యాలయం (Saluru Municipal Office)తో పాటు జయరాం (Jayaram) నివాసంతో పాటు మరో అధికారి ఇంట్లో సోదాలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story