HYD: మితిమీరుతున్న ఆగడాలు.. గ్రేటర్‌లో ఏదైనా నిర్మాణం చేయాలంటే ముందు వారికి వాటా ఇవ్వాల్సిందే!

by Gantepaka Srikanth |

గ్రేటర్ హైదరాబాద్‌లో కార్పొరేటర్ల డ్రైవర్లు, పీఏలు, అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణదారులు వీరి నుంచి పడరాని పాట్లు పడుతున్నారు.

HYD: మితిమీరుతున్న ఆగడాలు.. గ్రేటర్‌లో ఏదైనా నిర్మాణం చేయాలంటే ముందు వారికి వాటా ఇవ్వాల్సిందే!
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో కార్పొరేటర్ల డ్రైవర్లు, పీఏలు, అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణదారులు వీరి నుంచి పడరాని పాట్లు పడుతున్నారు. కార్పొరేటర్ల పేరు చెప్పి అందిన కాడికి దండుకున్నారు. వారు అడిగిందిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. లేకపోతే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఫోన్లు రావడం, నిర్మాణాల దగ్గరకు వచ్చి పనులు నిలిపివేయ డం జరుగుతున్నది. ఈ వ్యవహారమంతా కార్పొరేటర్ల కనుసన్నల్లోనే జరుగుతున్నా వారు తమకేమీ పట్టనట్లు, తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో జరుగుతున్న నిర్మాణా ల స్థాయిని బట్టి ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసుకుని వారి అనుచరులు, పీఏలు షాడో కార్పొరేటర్ల అవతారమెత్తుతున్నారు. మరి కొంతమంది అధికారులతో లాలూచి పడి వసూళ్లకు తెగబడుతున్నారు. కొన్ని చోట్ల జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు కార్పొరేటర్లే తమ అనుచరులతో ఫిర్యాదు చేయిస్తున్నారు. తిరిగి వారు రంగంలోకి దిగి సెటిల్ మెంట్లు చేస్తున్నారు. దీంతో వీరి అక్రమ వసూళ్ల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

ఎన్నికలకు నిధుల సమీకరణ..?

సుమారు మరో ఆరు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కార్పొరేటర్లు తమ అనుచరులతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే టాక్ జోరుగా వినబడుతున్నది. కొన్ని చోట్ల కార్పొరేటర్లే నేరుగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాల ని, అటువైపు కన్నెత్తి చూడొద్దని టౌన్ ప్లానింగ్ అధికారులకు హుకుం జారీ చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల గోషామహల్ సర్కిల్ లో టౌన్ ప్లానింగ్ అధికారులు, ఓ కార్పొరేటర్ గొడవ పడి పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది. చివరకు న్యాయ స్థానం అనుమతి తీసుకున్న పోలీసులు టౌన్ ప్లానింగ్ అధికారులపై కేసు నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితే నగరంలో చాలా నివ్వురు గప్పిన నిప్పులా ఉంది. చాలా చోట్ల మనకెందుకులే గొడవ అని అధికారులు సర్దుకుపోతున్నారు.

డిప్యూటీ మేయర్ భర్త డ్రైవర్‌పై కేసు..

అక్రమ వసూళ్లు, బెదిరింపుల వ్యవహారంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి భర్త శోభన్ రెడ్డి, డ్రైవర్ తుల్జాసింగ్‌పై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇతను భవన నిర్మాణదారుల నుంచి భారీగా వసూ ళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిర్మాణ అనుమతుల పేప ర్లు, డబ్బులు సర్కిల్ కార్యాలయానికి రావాలని ఉప్పల్ మెయిన్ రోడ్డులో భవన నిర్మాణం చేపడుతున్న యజమానిని బెదిరించాడు. దీంతో సదరు నిర్మాణదారుడు తుల్జాసింగ్ పేరుతో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఎవరూ లేరని నిర్ధారించుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అతని పై కేసు నమోదు చేయడం గ్రేటర్ లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరికొంతమంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు సమా చారం. మోతే శోభన్ రెడ్డి వద్ద తుల్జాసింగ్ డ్రైవర్‌గా పని చేస్తూ వ్యక్తిగత పనులు కూడా చేపడుతుంటారని తెలిసింది. ఇతను డిప్యూటీ మేయర్ పేరు చెప్పి నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణ యజమానులను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతున్నది.

Next Story