మష్రూమ్స్ తిని వృద్ధ దంపతులు మృతి

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-15 16:50:23  IST  )

ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వృద్ధ దంపతుల మరణంతో శ్రీకోట్ గ్రామం శోకసంద్రంలో నిండిపోయింది. మహావీర్ సింగ్, సరోజినీ దేవి దంపతులు.. తమ దగ్గరలో ఉండే అడవిలో నుంచి పుట్టగొడుగులు తీసుకొచ్చారు. టేస్టీగా వండుకుని

మష్రూమ్స్ తిని వృద్ధ దంపతులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వృద్ధ దంపతుల మరణంతో శ్రీకోట్ గ్రామం శోకసంద్రంలో నిండిపోయింది. మహావీర్ సింగ్, సరోజినీ దేవి దంపతులు.. తమ దగ్గరలో ఉండే అడవిలో నుంచి పుట్టగొడుగులు తీసుకొచ్చారు. టేస్టీగా వండుకుని ఫుడ్ ఎంజాయ్ చేద్దామనుకున్నారు. కానీ అవి విషపూరిత మష్రూమ్స్ కావడంతో కొన్ని గంటల్లోనే ఎఫెక్ట్ చూపింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలోనే చనిపోయారు. ఈ మష్రూమ్స్ అక్కడి కల్చరల్ ఫుడ్ కాగా ఇలాంటివి కూడా ప్రాణంతకంగా మారడాన్ని స్థానికులు తట్టుకోలేకపోతున్నారు.

అడవులు, పొలాలు, తడి ప్రాంతాల్లో పెరిగే పుట్టగొడుగుల్లో కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. వీటిలో ఉండే విషపూరిత పదార్థాలు.. సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. వాంతులు, కడుపు నొప్పి, అతిసారంతోపాటు కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్, కోమాలోకి కూడా వెళ్లొచ్చు. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. అందుకే అడవుల నుంచి సేకరించిన పుట్టగొడుగులను తినకూడదని సూచిస్తారు నిపుణులు.





Next Story