- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఆ రివాల్వర్ ఎక్కడిది..?
రివాల్వర్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

దిశ, సంగారెడ్డి / సంగారెడ్డి అర్బన్ : రివాల్వర్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కోటారి సందీప్ కుమార్ (26) అనే పోలీస్ కానిస్టేబుల్ సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో రివాల్వర్ తో ఎదపై కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. గత సంవత్సరం నవంబర్ లో నిర్వహించిన కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో అతడు పాసై సంగారెడ్డి పట్టణంలో తాజాగా సందీప్ విధుల్లో చేరాడు.
ఇంతలోనే ఈ ఘాతుకానికి పాల్పడడం సంచలనంగా మారింది. అయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఇతర నష్టాల వల్ల అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుడు తన తల్లి, సోదరితో కలిసి సంగారెడ్డిలోని నేతాజీ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఇతడి స్వస్థలం సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కోహిర్ గ్రామం.
రివాల్వర్ ఎక్కడిది..?
గన్ తో కాల్చుకొని చనిపోయిన కానిస్టేబుల్ సందీప్ కు రివాల్వర్ ఎక్కడిది అని ప్రశ్న ఏర్పడుతుంది. అయితే గన్నులు స్టోర్ చేసే స్టోర్ రూమ్ లో ఎవరు లేని సమయంలో అతడు రివాల్వర్ తీసుకొని వచ్చినట్లుగా తెలుస్తోంది. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు ఇతర విషయాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.






