ఏఐ టెక్నాలజీతో.. అచ్చం దోస్తు గొంతుతో ఫోన్ కాల్... కానిస్టేబుల్ కు 2 లక్షలు టోకరా..

by Bhanu |

స్నేహితుడు మాట్లాడే స్వరంతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ కానిస్టేబుల్ ను బురిడి కొట్టించారు. ఢిల్లీ విమానాశ్రయంతో తనను ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు పట్టుకున్నారని నమ్మించి 2 లక్షలు కొట్టేశారు.

ఏఐ టెక్నాలజీతో.. అచ్చం దోస్తు గొంతుతో ఫోన్ కాల్... కానిస్టేబుల్ కు 2 లక్షలు టోకరా..
X

దిశ, సిటీక్రైం : స్నేహితుడు మాట్లాడే స్వరంతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ కానిస్టేబుల్ ను బురిడి కొట్టించారు. ఢిల్లీ విమానాశ్రయంతో తనను ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు పట్టుకున్నారని నమ్మించి 2 లక్షలు కొట్టేశారు. ఈ సంఘటన పై పోలీసు కానిస్టేబుల్ హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మాణికేశ్వర్ నగర్ లో నివసించే (27) కానిస్టేబుల్ కు ఇటీవల వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ లండన్ లో ఉంటున్న స్నేహితుడు సత్య, అతని స్నేహితుడు డాక్టర్ లియో రాబర్ట్ తో కలిసి ఇండియాకు వస్తున్నట్లు చెప్పాడు.


తన స్నేహితుడు సత్య గొంతులాగానే మాట్లాడి లండన్ నుంచి ఢిల్లీ వచ్చానని ఇక్కడ ఎయిర్ పోర్టులో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. ఇంతలోనే మరో నెంబరుతో వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి మీ స్నేహితుడు క్లియరెన్స్ ట్యాక్స్ కట్టాలని వెంటనే 55 వేల చెల్లించాలని చెప్పాడు. దీంతో కానిస్టేబుల్ ఆ నగదును యూపిఐ ద్వారా పంపాడు. ఆ తర్వాత ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాలంటూ మరికొంత డబ్బును గుర్తు తెలియని వ్యక్తి డిమాండ్ చేశాడు. ఇలా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన కానిస్టెబుల్ ఏఐ టెక్నాలజీతో తన స్నేహితుడి గొంతుతో మాట్లాడి మోసం చేశారని అనుమానిస్తు తనను మోసం చేసి 2 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్ల పై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story