21ఏళ్లకే గుండెపోటు... రన్నింగ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థి మృతి

by Ajay Maddhiboyina |

ఈ మ‌ధ్య కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా గుండెపోటు మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య లేనివాళ్లు కూడా ఒక్క‌సారిగా కుప్ప‌కూలి మ‌ర‌ణిస్తున్నారు.

21ఏళ్లకే గుండెపోటు... రన్నింగ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మ‌ధ్య కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా గుండెపోటు మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య లేనివాళ్లు కూడా ఒక్క‌సారిగా కుప్ప‌కూలి మ‌ర‌ణిస్తున్నారు. చిన్న‌య‌సులోనే గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే తిరుప‌తి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నాగ‌ల‌పురం మండ‌లం సురుటుప‌ల్లికి చెందిన భాస్క‌ర్ (21) అనే యువ‌కుడు స్నేహితులతో క‌లిసి రన్నింగ్ చేస్తూ గుండెపోటుతో మ‌ర‌ణించాడు. డిగ్రీ పూర్తి చేసిన భాస్క‌ర్ స్నేహితుల‌తో క‌లిసి కొద్దిరోజులుగా పోలీస్ ఉద్యోగం సాధించాల‌ని ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే గుండెపోటు రావ‌డంతో చ‌నిపోయాడు. చేతికొచ్చిన కొడుకు మ‌ర‌ణంతో త‌ల్లి దండ్రులు, కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.

Next Story