HYD: మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్ని ప్రమాదానికి కుట్ర

by Gantepaka Srikanth |
HYD: మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్ని ప్రమాదానికి కుట్ర
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌‌లోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్(Malakpet Metro Station) వద్ద భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదానికి కొందరు గుర్తు తెలియని దుండగులు కుట్ర చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుట్ర పూరితంగా మెట్రో స్టేషన్(Metro Station) వద్ద పార్క్ చేసిన బైకులను తగులబెట్టినట్లు అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలంలో పెట్రోల్ పోసి తగులబెట్టిన ఆనవాళ్లు ఉండటంతో పోలీసుల అనుమానం బలపడింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదంలో మొత్తం ఐదు బైక్‌లు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. దీంతో భ‌యంతో స్థానికులు ప‌రుగులు పెట్టారు. ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. దీంతో మ‌ల‌క్‌పేట మెట్రో స్టేష‌న్ వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది.

Advertisement

Next Story

Most Viewed