- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి భారత్‌లో ఉగ్రదాడులకు కుట్రలు.. యాక్టివ్‌గా మహిళా విభాగం
భారతదేశంలో పహల్గామ్ ఎటాక్, ఎర్రకోట బ్లాస్ట్ తరహా మరిన్ని దాడులు చేసేందుకు పాక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ కుట్రలు చేస్తోంది. అయితే ఇందుకోసం పురుషులను కాకుండా మహిళా విభాగాన్ని యాక్టివేట్ చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో పహల్గామ్ ఎటాక్, ఎర్రకోట బ్లాస్ట్ తరహా మరిన్ని దాడులు చేసేందుకు పాక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ కుట్రలు చేస్తోంది. అయితే ఇందుకోసం పురుషులను కాకుండా మహిళా విభాగాన్ని యాక్టివేట్ చేస్తోంది. జమాత్ ఉల్ మొమినాత్ పేరుతో మహిళా ఉగ్రవాద విభాగం పనిచేస్తోంది. ఇక గురువారం పూంచ్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ మహిళ భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఆమెను గుర్తించి సైనికులు అదపులోకి తీసుకున్నారు. ఆ మహిళ షెహనాజ్ అక్తర్ గా గుర్తించగా పాక్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన మహిళ అని నిర్దారించారు. విచారణలో ఆ మహిళకు జైష్ ఎ మహ్మద్ తో లింకులు ఉన్నట్టు తేలింది.
అంతేకాకుండా సరిహద్దులు దాటే ముందు ఆ మహిళ పాకిస్థాన్ సైనికులతో మంతనాలు సాగించినట్టు కూడా తెలుస్తోంది. బార్డర్ దాటిన తరవాత ఆమె కలవాల్సిన వ్యక్తి గుర్తించి సైతం చర్చించినట్టు సమాచారం. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో మహిళా ఉగ్రవాదుల విషయం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మహిళా డాక్టర్ తో పాటు పలువురు పట్టుబడ్డారు. ఇక మహిళా ఉగ్రవాదుల విభాగంలో ఉగ్రవాదుల భార్యలే ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఉగ్రవాది మసూద్ సోదరి మహిళా ఉగ్రవాదుల విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్టు సమాచారం. ఇంటిలిజెన్స్ కు సమాచారం అందడంతో మహిళా ఉగ్రవాదులపై నజర్ పెంచినట్టు తెలుస్తోంది.






