- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ టికెట్ (బీ-ఫామ్) దక్కలేదనే మనస్థాపంతో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం..
చండూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి.

దిశ, చండూరు: చండూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. పార్టీ టికెట్ (బీ-ఫామ్) దక్కలేదన్న మనస్థాపంతో 9వ వార్డు కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. టికెట్ ఇవ్వడానికి ఎమ్మెల్యే సుముఖంగా ఉన్నా స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆయన ముందుగా సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయనను స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని, కార్యకర్తలంతా ఏకతాటిపై ఉన్నారని, నిన్ననే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారు. కానీ, ఆ ప్రకటన వెలువడిన మరునాడే చండూరు మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపు వ్యవహారం పార్టీలోని అసమ్మతిని బట్టబయలు చేసింది. ఆత్మహత్యాయత్నం చేసిన వేణు చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు భూతరాజు లత ఆశావహులుగా ఉన్నారు.






