- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో షాకింగ్: కాంగ్రెస్ నేత దారుణ హత్య
రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు బాల్‌రెడ్డి(50) హత్యకు గురయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు బాల్‌రెడ్డి(50) హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మధ్యాహ్నం దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి బాల్ రెడ్డి వచ్చారు. పని ముగించుకుని తిరిగి చెల్లాపూర్‌లోని ఇంటికి బైకుపై బయలుదేరారు. రాజక్కపేట గ్రామ శివారులోకి రాగానే కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షలు, భూ వివాదం కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






