నగరం నడిబొడ్డున కలకలం.. ఆటోలో ఇద్దరు యువకుల డెడ్‌బాడీలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 05:49:10  IST  )

హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున ఇద్దరు యువకుల మృతదేహాల కలకలం రేపుతున్నాయి.

నగరం నడిబొడ్డున కలకలం.. ఆటోలో ఇద్దరు యువకుల డెడ్‌బాడీలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం ఓల్డ్ సిటీ పరిధిలోని చాంద్రాయణగుట్ట (Chandrangutta)లో ఫ్లైఓవర్ కింద పార్క్ చేసిన ఓ ఆటోలో ఇద్దరు యువకుల డెడ్‌బాడీలను స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందజేయగా వారు వెంటనే స్పాట్‌కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అయితే, యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయిన ఇద్దరూ పహడీషరీఫ్ (Pahadisharif) ప్రాంతంలోని పిసల్‌బండ (Pisalbanda)కు చెందిన ఇర్ఫాన్, మహమ్మద్ జహంగీర్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో డ్రగ్స్ ఇంజెక్షన్లను పోలీసులు గుర్తించారు. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story