- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టికెట్ లేదని లంచం.. చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికుల దాడి
సంగారెడ్డి జిల్ల రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ ఇన్ స్పెక్టర్ పై దాడి జరిగింది. హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళుతున్న ఆర్టీసీ బస్సును టికెట్ చెకింగ్ కోసం అధికారులు ఆపేశారు.

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్ల రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ ఇన్ స్పెక్టర్ పై దాడి జరిగింది. హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళుతున్న ఆర్టీసీ బస్సును టికెట్ చెకింగ్ కోసం అధికారులు ఆపేశారు. టికెట్లు చెకింగ్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు టికెట్ లేకుండా పట్టుబడ్డాడు. దీంతో ప్యాసింజర్, కండక్టర్ పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడని చెబుతూ కండక్టర్, ప్రయాణికులు ఇన్ స్పెక్టర్ పై దాడి చేశారు. బస్సు ఎక్కువ సేపు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెకింగ్ అధికారిపై చెప్పులతో దాడి చేస్తూ ఏం చేసుకుంటావో చేసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.






