- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహశీల్దార్ కార్యాలయం ముందు మహిళా మృతదేహంతో ఆందోళన
దిశ, తెలకపల్లి : మహిళా మృతదేహంతో తహశీల్దార్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులు బంధువులు నిరసన తెలిపిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధిత మహిళా కుటుంబ సభ్యులు అందించిన

దిశ, తెలకపల్లి : మహిళా మృతదేహంతో తహశీల్దార్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులు బంధువులు నిరసన తెలిపిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధిత మహిళా కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని బొప్పల్లి గ్రామానికి చెందిన నేరడి లాలమ్మ(55) కు అదే గ్రామంలో 1 ఎకరా 20 గుంటల భూమి ఉందని అట్టి భూమి చాలాకాలంగా అదే గ్రామానికి చెందిన గుండురు నరసయ్య పేరు మీద పడటంతో తన భూమి తనకు కావాలని మృతురాలు నేరేడు లాలమ్మ అధికారుల చుట్టూ తిరిగిన తన పేరు పైకి రాకపోవడంతో ఇటీవల మనస్థాపంతో అనారోగ్యానికి గురై నాగర్ కర్నూల్ మండలం గన్యా గుల గ్రామంలో తన తల్లి ఊరిలో సోమవారం మృతి చెందిందని అన్నారు. కుటుంబ సభ్యులు బంధువులు లాలమ్మ మృతదేహాన్ని తహశీల్దార్ కార్యాలయానికి ఆటో లో తరలించి మృతికి కారణం రెవెన్యూ అధికారులు అని తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించారు. ఈ విషయం గమనించిన తహశీల్దార్ రెండు, మూడు రోజుల్లో పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు నిరసన విరమించారు.






