- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cold Murder: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం.. ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య
రాజస్థాన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. బలోత్రాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వివాహేతర సంబంధాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటాన్నాయి. తాజాగా తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య, ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా గొంతు నులిమి హతమార్చిన ఉదంతం రాజస్థాన్ (Rajasthan) లోని బలోత్రా (Balotra) జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు మాల్వా గోయ్లాన్ గ్రామానికి చెందిన మహేంద్ర మేఘవాల్ (23)తో నాలుగేళ్ల క్రితం అను దేవి (23)తో వివాహమైంది. అయితే, వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే, భార్య అనుదేవికి వివాహానికి ముందే ప్రియుడు అమ్రారామ్ (Amraram) ఉన్నాడు. అతడు ఓ ప్రభుత్వ పాఠశాలలో గ్రేడ్-3 ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
కాగా, మార్చి 20న మహేంద్ర మేఘవాల్ (Mahedra Medhawal), అను దేవి (Anu Devi)కి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న అనుదేవి అర్ధరాత్రి తన ప్రియుడు అమ్రారామ్‌ను ఇంటికి పిలిపించింది. మహేంద్ర గాఢనిద్రలో ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి అతని గొంతు నులిమి సైలెంట్ చంపేశారు. అనంతరం అమ్రారామ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ మరుసటి రోజు ఉదయం మహేంద్ర ఎంతకీ బయటకు రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. గదిలోకి వెళ్లి చూడగా మహేంద్ర విగతజీవిగా పడి ఉన్నాడు. అనుదేవి మాత్రం అతను ఇంకా నిద్రపోతున్నాడని అబద్ధం చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, మహేంద్ర మెడపై ఉన్న గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అను దేవి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది. దీంతో వారు తమదైన స్టైల్లో విచారించగా, తన ప్రియుడు అమ్రారామ్‌తో కలిసి భర్తను హతమార్చినట్లుగా ఆమె అంగీకరించింది. ఈ మేరకు పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






