ఆరేళ్లుగా తల్లితో సహజీవనం.. రెండేళ్లుగా కూతుళ్లపై అత్యాచారం.. బ్లడ్ టెస్‌తో విషయం వెలుగులోకి!

by D.Reddy |
ఆరేళ్లుగా తల్లితో సహజీవనం.. రెండేళ్లుగా కూతుళ్లపై అత్యాచారం.. బ్లడ్ టెస్‌తో విషయం వెలుగులోకి!
X

దిశ, వెబ్ డెస్క్: అతనో బాధ్యతయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. భార్య చనిపోవటంతో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత నీచానికి పాల్పడ్డాడు. తల్లి లేని సమయంలో ఆమె ఇద్దరు కూతుళ్లపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా ఆ కామాంధుడికి హెచ్ఐవీ (HIV) పాజిటివ్ రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుసుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొన్నేండ్ల క్రితం అతడి భార్య చనిపోయింది. ఈ క్రమంలో అతడికి భర్తతో విడిపోయిన ఓ మహిళతో 2018లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెతో సహజీవనంలో ఉంటున్నాడు. సదరు మహిళకు 19 ఏళ్లు, 15 ఏళ్లు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే, గత రెండేండ్లుగా ఆ మహిళ లేని సమయంలో వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లికి చెప్తే చంపేస్తానని బెదిరించటంతో ఈ బాలికలు మౌనంగా ఉండిపోయారు. అయితే ఇటీవల ఆ కామాంంధుడు‌‌‌‌‌‌‌ బ్లడ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయించుకున్నాడు. అందులో అతడికి హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా (HIV Positive) తేలింది. ఈ విషయం తెలియడంతో పాటు, తమపై అత్యాచారం చేశాడని ఇద్దరు అమ్మాయిలు తల్లికి చెప్పారు. ఈ విషయం తెలిసి షాక్ అయిన సదరు మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం తల్లీ ఇద్దరు కూతుళ్లకు సైతం హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు శాంపిళ్లు సేకరించారు.

Next Story

Most Viewed