- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోళ్ల పందాల స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్, ఒకరు పరారీలో.!
కోళ్ల పందాలు స్థావరంపై పోలీసులు దాడి చేసి అక్కడ కోళ్ల పందాలు ఆడుతున్న ఐదు వ్యక్తుల గాను నలుగురు వ్యక్తులను పట్టుకొని

దిశ, నేరేడుచర్ల : కోళ్ల పందాలు స్థావరంపై పోలీసులు దాడి చేసి అక్కడ కోళ్ల పందాలు ఆడుతున్న ఐదు వ్యక్తుల గాను నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద 2 పందెం కోళ్లు 10వేల నగదును 3 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులు వారి గూడెంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. నేరేడుచర్ల ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల మండలం కందుల వారి గూడెం గ్రామ శివారులో ఐదుగురు వ్యక్తులు కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందిందన్నారు.
వెంటనే తన సిబ్బందిని తీసుకొని ఆ కోళ్ల పందాల స్థావరంపై దాడి చేశామన్నారు. అక్కడ కందుల వారి గూడెం చెందిన నాగచారి నేతృత్వంలో నలుగురు వ్యక్తులు కోళ్ల పందాలు ఆడుతున్నట్లు గుర్తించామన్నారు. అందులో అక్కడ కోళ్ల పందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. అక్కడ 2 పందెం కోళ్లను 3 సెల్ ఫోన్లు 10వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనికి నేతృత్వం వహిస్తున్న నాగచారి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఐదుగురుపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నాగాచారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.






