- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సడన్‌గా వారిని చూసి నడిరోడ్డు మీద కాన్వాయ్ ఆపిన CM
నరసరావుపేట(Narasaraopet)లో సాయి సాధన చిట్ ఫండ్(Sai Sadhana Chit Fund) అధినేత పాలడుగు పుల్లారావు సుమారు రూ.170 కోట్లు అప్పు చేసి పరారైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నరసరావుపేట(Narasaraopet)లో సాయి సాధన చిట్ ఫండ్(Sai Sadhana Chit Fund) అధినేత పాలడుగు పుల్లారావు సుమారు రూ.170 కోట్లు అప్పు చేసి పరారైన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన గుంటూరు జిల్లా కోర్టులో లొంగిపోయారు. దీంతో కోర్టు.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం పాలడుగు పుల్లారావును గుంటూరు(Guntur) జిల్లా జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. పుల్లారావు బాధితులు సోమవారం రోడ్డెక్కారు. రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని సీఎం చంద్రబాబు(CM Chandrababu) గమనించారు. సడన్‌గా కాన్వాయ్(CM Convoy) ఆపించి బాధితులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సాయి సాధన చిట్ ఫండ్(Sai Sadhana Chit Fund)లో జరిగిన మోసాన్ని పూసగుచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులు వివరించారు. సుమారు 250 కోట్లకు పైగా మోసం చేసినట్లు చెప్పుకొచ్చారు. వారి ఆవేదన చూసి చలించినపోయిన సీఎం.. తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్లారు. మరోవైపు బాధితులు కోర్టును సైతం ఆశ్రయించారు. నరసరావుపేటలోని అన్ని బ్యాంకులకు సాయి సాధన చిట్ ఫండ్స్ ఆర్ధిక లావాదేవీలు నిలుపుదల చేయాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకోవైపు నరసరావుపేటలోని సాయిసాధన చిట్‌ఫండ్ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు.






