- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి మందలించాడని 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!
తండ్రి మందలించాడని స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబద్ లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: తండ్రి మందలించాడని స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబద్ లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దోమలగూడలో కొల్లా రాకేష్ లత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కుమారుడు అరవింద్ గాంధీనగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవతరగతి చదువుతున్నారు. అయితే పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయని బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే స్కూల్ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం దేశంలో ఆందోళనకరంగా మారింది. ఇటీవలే హైదరాబాద్ లో బాత్రూంలో ఓ స్కూల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఐడీ కార్డు మెడకు బిగించుకుని చనిపోయాడా అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు ఇటీవల ఢిల్లీలో స్కూల్ విద్యార్థి ఒకరు టీచర్ మందలించిందని భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు తరచూ జరగడంతో పిల్లల తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.






