కీసర గోల్డ్ షాపు చోరీ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్.. ఆ ఇద్ద‌రూ దొంగ‌లే

by Ajay Maddhiboyina |

కీస‌ర గోల్డ్ షాపు చోరీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. గోల్డ్ షాపులో దొంగ‌త‌నం జ‌రిగిన రోజు సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

కీసర గోల్డ్ షాపు చోరీ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్.. ఆ ఇద్ద‌రూ దొంగ‌లే
X

దిశ‌, వెబ్ డెస్క్: కీస‌ర గోల్డ్ షాపు చోరీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. గోల్డ్ షాపులో దొంగ‌త‌నం జ‌రిగిన రోజు సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌ట షాపులో కూర్చున్న ఇద్ద‌ర‌ని క‌స్ట‌మ‌ర్లు అనుకున్నారు. కానీ వారిద్ద‌రూ కూడా దొంగ‌ల ముఠాకు చెందిన‌వారేన‌ని తేలింది. మొద‌ట‌గా ఇద్ద‌రు నిందితులు క‌స్ట‌మ‌ర్లుగా షాపులోకి వ‌చ్చి న‌గ‌లు కొనే నెపంతో షాపులో ప‌రిస్థితిని గ‌మ‌నించారు. య‌జ‌మాని ఒంటిరిగా ఉన్నాడ‌ని తెలుసుకుని బ‌య‌ట ఉన్న గ్యాంగ్ కు స‌మాచారం ఇచ్చారు. త‌ర‌వాత ఇద్ద‌రు దొంగ‌లు లోప‌లికి వ‌చ్చి య‌జ‌మానిపై దాడి చేసి న‌గ‌లు ఎత్తుకెళ్లారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు క‌స్ట‌మ‌ర్లుగా లోప‌లికి వ‌చ్చిన ఇద్ద‌రితో పాటు ఇద్ద‌రు దొంగ‌లు ప్లాన్ చేసిన మ‌రో వ్య‌క్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు A1 నజీమ్ అజీజ్, A2 బిష్ణు కర్మ, A3 మొహ్మద్ సఫీ, A4 రాజేందర్ సింగ్, A5 రత్నా సింగ్ గా గుర్తించారు. వీళ్లు నగరు శివారు ప్రాంతాల్లో ఉన్న బంగారు షాపుల్ని టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నని విచార‌ణ‌లో తేలింది. దొంగ‌త‌నానికి ముందు దుకాణాల ముందు రెక్కీ నిర్వ‌హిస్తార‌ని పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా గ‌తంలోనూ వీరిపై కేసులు ఉండ‌గా A1 , A2ల‌కు చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ప‌రిచ‌యం ఏర్ప‌డిన‌ట్టు గుర్తించారు.

Next Story