- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొండపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు
by Bhanu |
చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

X
దిశ, చింతలపాలెం : చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కందుకూరి కోటేష్ (30) సుతారి పనికి వెళ్లుతుండగా, దొండపాడు గ్రామంలోని గంగమ్మ గుడి వద్ద జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కోటేష్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై బాధితుడి కుటుంబ సభ్యులు చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
Next Story






