- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్చి వ్యాపారికి బెదిరింపులు..గంజాయి కేసులో ఇరికిస్తామంటూ 6 లక్షలు వసూలు
ఖమ్మం నగరంలో కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ కు చెందిన మిర్చి వ్యాపారి డబ్బులను అడ్డగించి టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ బెదిరించి నా ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలో కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ కు చెందిన మిర్చి వ్యాపారి డబ్బులను అడ్డగించి టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ బెదిరించి నా ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అసలు మిర్చి వ్యాపారి గుమస్తాను బెదిరించింది కానిస్టేబుల్ లేనా మరి ఎవరైనా ఉన్నారా అనే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తంలో ఓ ఉన్నతాధికారి అతనితో ఓ జర్నలిస్టు ఉండి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో పోలీసులే నిందితులా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కోట్లలో వ్యాపారం జరుగుతోంది. దూరభారాల నుంచి డబ్బులు తెచ్చుకునే వ్యాపారులు వారి గుమస్తాల నుంచి, బంధువుల సహకారంతో వ్యాపారం కోసం డబ్బులు తెప్పించుకుంటూ ఉంటారు. ఈ వ్యాపారంపై అవగాహన ఉన్న వ్యక్తి సహకారంతో పోలీసు ఉన్నతాధికారి రాజస్థాన్ వ్యాపారికి చెందిన గుమస్తాను అడ్డుకొని డబ్బులు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తం రూ.10లక్షలు తీసుకు వస్తున్న గుమస్తాను అడ్డుకున్న కానిస్టేబుల్ ఆరు లక్షల తీసుకున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారి ప్రమేయం లేకుండా ఈ వ్యవహారం సాధ్యం కాదని సొంత శాఖలోనే గుసగుసలు వినపడుతున్నాయి. ఆయన తప్పించుకునేందుకే కానిస్టేబుల్‌లను పావుగా మార్చినట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో వర్తక సంఘ ప్రతినిధులు సదరు వ్యక్తులతో రాయబారం నడిపి విషయాన్ని బయటకి రానివ్వకుండా మేనేజ్ చేశారని తెలుస్తుంది. తప్పు చేసిన వ్యక్తులను కాపాడేందుకు కొంతమంది ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని బాధితునికి డబ్బులు ఇప్పించి, సమస్య పరిష్కారం చేసినట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారులు లోతుగా పరిశీలించి, అసలు కారుకులైన వారిని శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






